ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం 'పుష్ప'. పాన్ ఇండియా చిత్రంగా సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తొలి భాగం.. పార్ట్ 1 'పుష్ప: ది రైజ్' పేరుతో డిసెంబర్ 17 అన్ని భాషల్లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం విడుదలై ఇంకా రెండు రోజులు కూడా పూర్తి కాకుండానే మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. కొత్త సంవత్సరం కానుకగా ఈ చిత్రం డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. పుష్ప.. ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ఫ్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రచారం సినిమా విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ఒక వేళ నాలుగు వారాలు అయితే.. జనవరి 14న, ఆరు వారాలు అయితే.. జనవరి 28న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే.. దీనిపై చిత్రబృందం కానీ, అమెజాన్ ఫ్రైమ్ నుంచి గానీ ఇంత వరకు అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.