యూట్యూబ్‌లో దూసుకెలుతున్న 'పుష్ప‌'.. మ‌రో రికార్డు సెట్ చేశాడు

Pushpa Movie teaser trends with 60 plus million views.పుష్ప టాలీవుడ్ లో 60ప్ల‌స్‌ మిలియన్ల వ్యూస్ తో పాటు 1.4 ప్ల‌స్ మిలియన్ల లైక్స్ సాధించిన ఫస్ట్‌ అండ్‌ ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డు బద్దలు కొట్టింది. .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 May 2021 5:51 AM GMT
pushpa record

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ప‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా క‌నిపించ‌నున్నాడు. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. ఈ టీజ‌ర్ యూ ట్యూబ్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొడుతూనే ఉంది. మొన్నా మధ్య టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 50ప్లస్‌ మిలియన్ వ్యూస్ సాదించిన ఈ టీజర్‌.. ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేసింది.

టాలీవుడ్ లో 60ప్ల‌స్‌ మిలియన్ల వ్యూస్ తో పాటు 1.4 ప్ల‌స్ మిలియన్ల లైక్స్ సాధించిన ఫస్ట్‌ అండ్‌ ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డు బద్దలు కొట్టింది. ఇంతవరకూ తెలుగులో ఒక టీజర్ కి ఈ స్థాయి వ్యూస్ .. లైక్స్ రావడం ఇదే మొదటిసారి. బన్నీ ఖాతాలో ఈ రికార్డు చేరడంతో ఆయన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు.


Next Story