దూసుకుపోతున్న పుష్ప టీజ‌ర్‌..

Pushpa movie teaser trending.అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 12:18 PM IST
Pushpa teaser

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప‌'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తోంది. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే పుష్ప టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర బృందం. విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే ఏకంగా 12 మిలియ‌న్ వ్యూస్‌, 600కే లైక్స్‌తో దూసుకుపోతుంది ఈ టీజ‌ర్‌. ప్ర‌స్తుతం 'పుష్ప' టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ టీజర్ 24 గంటల్లో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అల్లు అర్జున్.. పుష్పరాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక ట్రైబల్ యువతి పాత్రను పోషిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ‌భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ఫాజిల్ ఫ‌హ‌ద్ విల‌న్ పాత్ర‌ను చేస్తుండ‌డం విశేషం. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం ఆగ‌స్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story