దూసుకెలుతున్నఐకాన్ స్టార్.. మరో రికార్డు సెట్ చేశాడు
Pushpa Movie teaser crossed fastest 70 million views.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్
By తోట వంశీ కుమార్ Published on 4 Jun 2021 5:19 PM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక మందాన నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు పహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. ఈ టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. మొన్నా మధ్య టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా 60ప్లస్ మిలియన్ వ్యూస్ సాదించిన ఈ టీజర్.. ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేసింది.
First & Fastest 70M+ views with 1.6M+ Likes 🔥#PushpaRaj 🔥#ThaggedheLe 🤙
— Pushpa (@PushpaMovie) June 4, 2021
- https://t.co/1LIA6cH98I#IntroducingPushpaRaj#Pushpa@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @MythriOfficial
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/gq007FqyYg
టాలీవుడ్ లో 70ప్లస్ మిలియన్ల వ్యూస్ తో పాటు 1.6 ప్లస్ మిలియన్ల లైక్స్ సాధించిన ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డు బద్దలు కొట్టింది. ఇంతవరకూ తెలుగులో ఒక టీజర్ కి ఈ స్థాయి వ్యూస్ .. లైక్స్ రావడం ఇదే మొదటిసారి. బన్నీ ఖాతాలో ఈ రికార్డు చేరడంతో ఆయన అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నాడు.