దుమ్మలేపుతున్న 'పుష్ప' టీజర్.. రికార్డులన్ని బ్రేక్
Pushpa Movie Teaser Creates New Record. 'పుష్ప' టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.
By Medi Samrat Published on 9 April 2021 3:03 PM IST
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా.. ఒకరోజు ముందుగా 'పుష్ప' టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ తో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో దుమ్మురేపుతున్న 'పుష్ప' టీజర్ తాజాగా 30 మిలియన్ల వ్యూస్ ను దాటేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రయూనిట్ పోస్టర్ ను విడుదల చేశారు.
Humongous 30M+ Views, 900k+ Likes and counting! 🔥#ThaggedheLe 🤙
— Mythri Movie Makers (@MythriOfficial) April 9, 2021
- https://t.co/aDJPtArXyH#Pushpa#IntroducingPushpaRaj#PushpaRaj@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/pEl8g7jA8d
ఇదిలావుంటే.. ఈ సినిమా టాలీవుడ్ హిట్ కాంబినేషన్‌గా పిలిచే.. అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్‌లో పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 13న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
#PushpaRaj Receives a Grand Welcome across India ♥#ThaggedheLe 🤙
— Mythri Movie Makers (@MythriOfficial) April 8, 2021
- https://t.co/aDJPtArXyH#Pushpa#IntroducingPushpaRaj@alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @resulp @adityamusic @PushpaMovie
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/Xbq3jTJ6SN
కాగా టాలీవుడ్ లో 24 గంటల్లో పుష్ప టీజర్ 25 మిలియన్ వ్యూస్ తో రికార్డులు బ్రేక్ చేయగా, సరిలేరు నీకెవ్వరు టీజర్ 14.64 మిలియన్ వ్యూస్, రామరాజు ఫర్ భీం టీజర్ 14.14 మిలియన్ వ్యూస్, సాహో టీజర్ 12.94 మిలియన్ వ్యూస్, మహర్షి టీజర్ 11.14 మిలియన్ వ్యూస్ సాధించాయి. అయితే వ్యూస్ పరంగా 'కేజిఎఫ్-2' టీజర్ మొదటి స్థానాల్లో ఉండగా... 'పుష్ప' టీజర్ రెండవ స్థానంలో ఉంది.