బ‌న్నీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. 'పుష్ప' సక్సెస్ మీట్ ర‌ద్దు

Pushpa movie success meet in Kakinada cancelled today.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం పుష్ప. సుకుమార్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2021 9:04 AM GMT
బ‌న్నీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. పుష్ప సక్సెస్ మీట్ ర‌ద్దు

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 17 ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స‌క్సెస్ పుల్ గా భారీ వ‌సూళ్ల‌తో థియేట‌ర్ల‌లో ఈ చిత్రం దూసుకుపోతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం తెలుగు రాష్ట్రాల‌లో ప‌లు న‌గ‌రాల్లో స‌క్సెస్ మీట్‌ల‌ను ఏర్పాటు చేసి అభిమానుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తుంది. ఈ క్ర‌మంలో నేడు(శుక్ర‌వారం) సాయంత్రం కాకినాడ‌లో స‌క్సెస్‌మీట్‌కు చిత్ర‌బృంద ప్లాన్ చేసింది. అయితే.. అధికారుల నుంచి అనుమ‌తి రాక‌పోవ‌డంతో ఈ ఈవెంట్‌ను ర‌ద్దు చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ తెలియ‌జేసింది.

'ఈరోజు కాకినాడలో జరగాల్సిన 'పుష్ప' మాసీవ్ సక్సెస్ పార్టీ పర్మిషన్ సమస్యల కారణంగా రద్దు అయ్యింది!' అంటూ ట్వీట్ చేసింది.

రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని ప‌లువురు అంటున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ క‌మ్ లారీ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ పాత్ర‌లో ఊర మాస్ లుక్‌లో బ‌న్నీ ఈ చిత్రంలో అద‌ర‌గొట్టారు. బ‌న్ని స‌ర‌స‌న రష్మిక మందన్నా న‌టించ‌గా.. సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు.

Next Story
Share it