అద్భుత‌మైన లొకేష‌న్‌లో 'పుష్ప' షూటింగ్.. ఫోటోలు వైర‌ల్‌

Pushpa movie shooting in beautiful location.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న‌చిత్రం పుష్ప‌. క్రియేటివ్ డైరెక్ట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Sept 2021 1:11 PM IST
అద్భుత‌మైన లొకేష‌న్‌లో పుష్ప షూటింగ్.. ఫోటోలు వైర‌ల్‌

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న‌చిత్రం 'పుష్ప‌'. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బన్ని స‌ర‌సన ర‌ష్మిక మందన్న న‌టిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. దేవీ శ్రీప్రాసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్స్‌, దాక్కో దాక్కో మేక‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. రెండు పార్టులుగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం ఓ అప్‌డేట్ ఇచ్చింది. సినిమాలోని ఓ సాంగ్ అద్భుతమైన లొకేషన్లో షూటింగ్ జరుపుకుంది అంటూ ఆ ఫోటోల‌ను కూడా షేర్ చేసింది.

ఫోటోలో షూటింగ్ స్పాట్ లో వేసిన టెంట్, కారవాన్లు, ప్రొడక్షన్ వ్యాన్లు క‌నిపిస్తున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు పచ్చని ప్రకృతి, నిండుగా ప్రవహిస్తున్న నదీ, ఆ నదీ తీరం ఆ ఫోటోల్లో క‌నిపిస్తుంది. ఆ ఫోటోల్లో చూస్తుంటే చాలా అందంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కాగా.. త్వరలోనే సినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించబోతున్న‌ట్లు ట్వీట్ చేసింది చిత్ర‌బృందం. ఈ చిత్రంలో మలయాళ న‌టుడు ఫహద్ ఫాసిల్ కీల‌క‌ పాత్రలో నటిస్తున్నారు. శేషాచలం కొండలలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story