పుష్ప మేకింగ్ వీడియో.. ప‌ర్యావ‌ర‌ణంపై బ‌న్ని ప్ర‌త్యేక సూచ‌న‌లు

Pushpa Movie making video released.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. రెండు భాగాలుగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Dec 2021 1:36 PM IST
పుష్ప మేకింగ్ వీడియో.. ప‌ర్యావ‌ర‌ణంపై బ‌న్ని ప్ర‌త్యేక సూచ‌న‌లు

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం 'పుష్ప‌'. రెండు భాగాలుగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. తొలి భాగం 'పుష్ప : ది రైజ్' పేరుతో ఈ నెల(డిసెంబ‌ర్) 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే ఈ చిత్రంలోని పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. రేపు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే వెల్ల‌డించింది చిత్ర‌బృందం.

తాజగా 'పుష్ప' ప్రత్యేక మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని ఎక్కువ భాగం మారేడుమిల్లి అడ‌వుల్లో చిత్రీక‌రించారు. కాగా.. ఎవ‌రు కూడా ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌కూడ‌ద‌ని అల్లుఅర్జున్ ముందుగానే అంద‌రికి సూచించాడ‌ట‌. ఈ విష‌యాన్నే మేకింగ్ వీడియోలో చూపించారు. స్పాట్‌ను చాలా శుభ్రంగా ఉంచాలని, షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరి ప్లాస్టిక్ బాటిళ్లను, ప్లాస్టిక్ కప్పులను వారే క్లీన్ చేసుకోవాలని స్పాట్ లోని నటీనటులు, సిబ్బందిని బ‌న్ని రిక్వెస్ట్ చేయడం ఆవీడియోలో క‌నిపించింది. ఆ తరువాత సినిమాకు సంబంధించిన మేకింగ్‌ స‌న్నివేశాల‌ను చూపించారు.

దేశీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో మ‌ల‌యాళం న‌టుడు ఫాహ‌ద్ ఫాసిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈచిత్రంలో అనసూయ భరద్వాజ్, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Next Story