'పుష్ప' డిలేటెడ్ సీన్.. అదిరిపోయింది ఎందుకు తీసేశారో
Pushpa Deleted Scene out.ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన
By తోట వంశీ కుమార్ Published on 31 Dec 2021 1:42 PM ISTఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. బన్నీ యాక్టింగ్, దర్శకుడు సుకుమార్ టేకింగ్ ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టిస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా.. సినిమా నిడివి కాస్త ఎక్కువ ఉండడంతో కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఈ తొలగించిన సన్ని వేశాలను ఒక్కొక్కటిగా.. చిత్ర నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తోంది.
ఈ వీడియోలో పుష్పరాజ్ ఓ వడ్డీవ్యాపారి దగ్గర అప్పుచేయడం ఆ అప్పు తీర్చకపోవడంతో అతడు ఇంటిమీదికొచ్చి గొడవచేయడం చూపించారు. భారతమ్మ ఎంతకాలం తప్పించుకుంటావ్ ఇట్టా. పోయిన గంగజాతరకు ఇస్తి. ఇప్పటిదాకా అసలు లేదు. వడ్డీ లేదు అంటూ రెడ్డప్ప అనే వ్యాపారి కేకలు వేయడంతో పుష్పరాజ్ కోపంతో ఊగిపోతాడు. మరుసటి రోజు ఇంట్లో ఉన్న గేదెను అమ్మేసీ రెడ్డప్ప బాకీ చెల్లిస్తాడు. నీ లెక్క సరిపోయింది సరే.. మరి నా లెక్క. మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెలిసింది. మరి, తిరిగి ఇచ్చేశామని ఊరంతా తెలియవద్దా అని అతడిని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి.. పుష్పరాజ్ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు అని చెప్పిస్తాడు. ఈ సన్నివేశం విజిల్స్ వేయించేలా ఉండగా.. ఎందుకు డిలీట్ చేశారని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ సన్నివేశం సినిమా ఉంటే బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.