హైదరాబాద్ లో పుష్ప-2 భారీ ఈవెంట్.. లీక్స్ ఇవే..!

పుష్ప 2 సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పుష్ప: ది రైజ్ భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

By Medi Samrat  Published on  25 Nov 2024 3:18 PM IST
హైదరాబాద్ లో పుష్ప-2 భారీ ఈవెంట్.. లీక్స్ ఇవే..!

పుష్ప 2 సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పుష్ప: ది రైజ్ భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠభరితమైన కథనం, పవర్‌ఫుల్ పెర్‌ఫార్మెన్స్‌లు, అద్భుతమైన డైలాగ్స్‌తో ఈ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా మారబోతోంది. అన్నీ కలిసొస్తే ఆల్ టైమ్ ఇండియన్ సినిమా రికార్డులను ఈ సినిమా సాధించబోతోంది.

పాట్నా, చెన్నై ఈవెంట్స్ తర్వాత, మేకర్స్ నవంబర్ 30 న హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో రెండవ ట్రైలర్ లాంచ్‌తో సహా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ లేదా ఎల్‌బి స్టేడియంలో ఈవెంట్ చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఐకానిక్ వేదికలలో ఒకదానిలో ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన పాస్‌లను భారీగా పంపిణీ చేయాలని ప్రొడక్షన్ టీమ్ ప్లాన్ చేస్తోంది.

సినిమాకు సంబంధించిన ఉత్కంఠను మరింత పెంచుతూ, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావచ్చని అంటున్నారు. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక మందన్న నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5, 2024న విడుదల కాబోతోంది.

Next Story