బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న‌ 'పుష్ప రాజ్‌'

పుష్ప-2 విధ్వంసం ఆగ‌డం అసాధ్యం అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది.

By Medi Samrat  Published on  18 Dec 2024 3:55 AM GMT
బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న‌ పుష్ప రాజ్‌

పుష్ప-2 విధ్వంసం ఆగ‌డం అసాధ్యం అనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా విడుదలైనప్ప‌టి నుంచి క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తుంది. పుష్ప: రూల్ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 280 కోట్లు, భారత్‌లో రూ. 170 కోట్లు క‌లెక్ష‌న్లు సాధించింది.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషల కంటే హిందీ భాషల్లో శరవేగంగా వసూళ్లు సాధిస్తోంది. హిందీలో ఈ సినిమా ప్ర‌తిరోజు డబుల్ డిజిట్ బిజినెస్ చేస్తోంది. 13వ రోజుతో ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ వద్ద మరో కొత్త చరిత్రను లిఖించి మరో రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధమైంది.

అల్లు అర్జున్ తెలుగు చిత్రసీమలో ఐకాన్ స్టార్ అయినప్పటికీ.. హిందీలో 'పుష్ప-2' విడుదల తర్వాత అతడి ఫాలోయింగ్‌ చాలా పెరిగింది. అల్లు అర్జున్‌పై, అతడి సినిమాపై ప్రేక్షకులు ఎంత ప్రేమను చూపిస్తున్నారో హిందీ భాషలో రోజువారీ సంపాదనను బట్టి ఊహించవచ్చు. సోమవారం తర్వాత మంగళవారం కూడా హిందీ బెల్ట్‌లో సినిమాపై భారీ కరెన్సీ వర్షం కురిసింది.

Sakanlik.com నివేదికల ప్రకారం.. ఈ చిత్రం విడుదలైన 12వ రోజు మొత్తంగా దాదాపు రూ.20.5 కోట్లు వసూలు చేయగా, విడుదలైన 13వ రోజు అంటే మంగళవారం ఒక్కరోజే సినిమా దాదాపు రూ.18.5 కోట్లు రాబట్టింది. 13వ రోజు ఇతర భాషలతో పోలిస్తే ఈ క‌లెక్ష‌న్‌లు చాలా బాగున్నాయి.

తొలిరోజు-రూ.70.3 కోట్లు

రెండో రోజు-రూ.56.9 కోట్లు

మూడో రోజు-రూ.73.5 కోట్లు

నాలుగో రోజు-రూ.85 కోట్లు

ఐదో రోజు-రూ.46.4 కోట్లు

6వ రోజు-రూ.36 కోట్లు

ఏడో రోజు-30 కోట్లు

ఎనిమిదో రోజు-రూ.27 కోట్లు

తొమ్మిదో రోజు-27 కోట్లు

10వ రోజు-రూ.46 కోట్లు

పదకొండవ రోజు-రూ.54 కోట్లు

పన్నెండవ రోజు-రూ. 20.5 కోట్లు

పదమూడో రోజు-రూ.18.5 కోట్లు

దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.953.3 కోట్లు రాబట్టిన పుష్ప 2 చిత్రం కేవలం హిందీ భాష నుంచే కేవలం 13 రోజుల్లో రూ.591.1 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం బుధవారం నాటికి హిందీ బెల్ట్‌లో రూ.600 కోట్ల క్లబ్‌లో చేరనుంది.

శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో నటించిన‌ 'స్త్రీ 2' చిత్ర క‌లెక్ష‌న్‌ల‌ను పుష్ప 2 బ్రేక్ చేసే అవ‌కాశం ఉంది. జవాన్-యానిమల్, గదర్ 2 చిత్రాల తర్వాత ఈ ఏడాది విడుదలైన అత్యంత బ్లాక్ బస్టర్ చిత్రం 'స్త్రీ 2' రికార్డును ఈ చిత్రం త్వరలోనే బద్దలు కొట్టి బాక్సాఫీస్ రారాజుగా అవతరించ‌నుంది.

Next Story