Pushpa 2: భన్వర్ సింగ్ షెకావత్‌గా అదిరిన ఫహద్ ఫాజిల్ లుక్

'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన.. ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా హిట్‌ అయ్యింది.

By అంజి  Published on  8 Aug 2023 12:15 PM IST
pushpa 2, fahadh faasil, bhanwar singh shekhawat, Allu Arjun

Pushpa 2: భన్వర్ సింగ్ షెకావత్‌గా అదిరిన ఫహద్ ఫాజిల్ లుక్

'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ స్లైలిస్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన.. ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా హిట్‌ అయ్యింది. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగ్స్‌ వరల్డ్‌ వైడ్‌గా వైరల్‌ అయ్యాయి. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ పూర్తిగా డీ గ్లామర్‌గా కనిపించడంతో పాటు తన నటనతో ఈ సినిమాను నిలబెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా పార్ట్‌ 2 రెడీ అవుతోంది. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సెకండ్‌ పార్ట్‌ షూటింగ్‌ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే సెకండ్‌ పార్ట్ నుంచి రిలీజైన గ్లింప్స్‌, పోస్టర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచాయి. పుష్ప సినిమాలో మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌.. పోలీస్‌ ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ రోల్‌లో నటించి అందరినీ మెప్పించారు. సినిమా ఇంకో 20 నిమిషాల్లో అయిపోతుందన్న టైంలో ఎంట్రీ ఇచ్చిన ఫహద్‌.. తన క్యారెక్టర్‌తో సినిమాని రక్తి కట్టించాడు.

క్లైమాక్స్ సీన్ కూడా అల్లు అర్జున్, ఫహద్ మధ్యే ఉంటుంది. ఫహద్ బట్టతల, భీకరమైన రూపం, మండుతున్న కళ్ళు, ప్రతీకార చిరునవ్వుతో స్క్రీన్‌ని షేక్ చేసాడు. దీంతో ఈ క్యారెక్టర్‌కి బాగా పేరు వచ్చింది. సెకండ్ పార్ట్‌లో ఫహద్ బన్నీపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఉంటుంది. నేడు ఫహద్‌ ఫాజిల్‌ పుట్టిన రోజు సందర్భంగా.. లేటెస్ట్‌గా 'పుష్ప 2' నుంచి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఫహద్ గుండుతో.. బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. సిగరెట్ కాలుస్తూ స్టైలిష్ గా పవర్ ఫుల్‌గా ఉన్నాడు. విలన్‌నే ఇంత పవర్ ఫుల్ గా చూపిస్తే.. అల్లు అర్జున్‌ని ఇంకా ఎంత పవర్ ఫుల్ గా చుపిస్తారేమోనని అభిమానులు అనుకుంటున్నారు. కాగా ఫహద్ ఫస్ట్ లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఫహద్ కి బర్త్‌ డే విషెస్‌ తెలుపుతున్నారు.

Next Story