పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేప‌టికి వాయిదా

Puneeth Rajkumar's Final Rites Postponed To Sunday.కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Oct 2021 3:22 PM IST
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు రేప‌టికి వాయిదా

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. ఈ రోజు సాయంత్ర‌మే పునీత్ అంత్య‌క్రియ‌లు జ‌రుగుతాయ‌ని తొలుత ప్ర‌క‌టించినా.. ఆ కార్య‌క్ర‌మాన్ని రేప‌టికి వాయిదా వేసిన‌ట్లు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై అధికారికంగా ప్ర‌క‌టించారు. పునీత్ కుమారై అమెరికా నుంచి రావ‌డానికి ఆల‌స్యం కానుండ‌డంతోనే అంత్య‌క్రియ‌ల‌ను రేప‌టికి వాయిదా వేశారు. పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు వినయ్ రాజ్ కుమార్ రేపు పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

శుక్ర‌వారం ఉద‌యం గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ క‌న్నుమూశారు. సాయంత్రం ఆయన భౌతికకాయాన్ని ఇంటికి, అక్కడి నుంచి కంఠీరవ స్టేడియంకు తరలించి, అప్పటి నుంచి అభిమానుల సందర్శనార్థం అక్కడే ఉంచారు. ఆయ‌న్ను ఆఖ‌రి సారి చేసేందుకు అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ఇక సెలెబ్రిటీలు సైతం పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహాన్ని చూసి కన్నీటి నివాళులర్పిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని భాష‌ల న‌టీన‌టులు అభిమానులు బ‌రువెక్కిన గుండెతో క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్‌కు నివాళుల‌ర్పిస్తున్నారు.

Next Story