పునీత్ మరణవార్త విని ఆగిన అభిమాని గుండె
Puneeth Rajkumar fan died due to heart attack.కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతితో దక్షిణాది సినీ
By తోట వంశీ కుమార్ Published on 30 Oct 2021 7:25 AM GMT
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతితో దక్షిణాది సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన ఇక లేరనే వార్తను జీర్ణించుకోవడం చాలా కష్టంగా మారింది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఆయన హీరోనే. తనకు చేతనైన సాయాన్ని చేసి ఎందరినో ఆదుకున్నారు. ఆయన్ను కడసారి చూసేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి అభిమానులు పొటెత్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆయన మరణవార్త విని మునియప్పన్ అనే అభిమాని గుండె ఆగిపోయింది.
పొన్నాచ్చి తాలూకాలోని మరూరుకి చెందిన మునియప్పన్.. పునీత్ కు వీరాభిమాని. పునీత్ ఇక లేరనే విషయం తెలియగానే గుండెపోటుతో మునియప్పన్ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే.. అప్పటికే మునియప్పన్ చనిపోయాడని వైద్యులు తెలిపారు. మునియప్పన్‌కు భార్య, ఏడాది వయస్సు ఉన్న పాప ఉంది. ఈ సంఘటన అభిమానులను మరింత బాధకు గురిచేస్తోంది.
పునీత్ రాజ్‌కుమార్ మరణవార్త వినగానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. థియేటర్లను మూసివేసింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యపాన నిషేధం విధించారు. నేటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మద్యం అమ్మకాలపై ఆంక్షలు విధించింది. అభిమానులు మద్యం మత్తుల్లో దాడులు, విధ్వంసానికి దిగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ్‌కుమార్ మరణించిన సమయంలో అభిమానులు విద్వంసానికి దిగిన సంగతి తెలిసిందే.