పునీత్ స్టైల్లో 'నాటు నాటు' సాంగ్.. వీడియో వైర‌ల్‌

Puneet steps to Natu Natu song.ద‌ర్శ‌క‌దీరుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Nov 2021 9:13 AM GMT
పునీత్ స్టైల్లో నాటు నాటు సాంగ్.. వీడియో వైర‌ల్‌

ద‌ర్శ‌క‌దీరుడు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్(రౌద్రం ర‌ణం రుధిరం)'. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ రాజుగా క‌నిపించ‌నున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. జ‌న‌వ‌రి 7న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా న‌వంబ‌ర్ 10న 'నాటు నాటు' పాట‌ను విడుద‌ల చేసింది. ఈ పాట ఇప్ప‌టికే 3 కోట్ల‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటలో తార‌క్‌, చరణ్‌లు మాస్‌ సెప్పులు ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇక ఈ పాట‌కు క‌న్న‌డ దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్‌కుమార్ స్టెప్పులేసే ఎలా ఉంటుందో తెలియ‌జేస్తూ ఓ నెటీజ‌న్ ఓ వీడియో క్రియేట్ చేశాడు. పునీత్ రాజ్ కుమార్ డ్యాన్స్‌ స్టెప్పులకు నాటు నాటు కన్నడ వెర్షన్ మాషప్‌ను రూపొందించారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా.. వైర‌ల్‌గా మారింది. పునీత్ డ్యాన్స్ అదుర్స్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అక్టోబ‌ర్ 29న పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. త‌మ అభిమాన హీరోని త‌ల‌చుకుంటూ అభిమానులు ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నారు.

Next Story
Share it