ప‌వ‌న్ క‌ల్యాణ్‌-క్రిష్ మూవీ టైటిల్ ఇదే

PSPK 27 Harihara Veeramallu glimpse is out.మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' అనే టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2021 5:49 PM IST
PSPK 27 Harihara Veeramallu glimpse is out

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల‌కు నిజంగా గుడ్‌న్యూస్ ఇది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్.. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి ఏ టైటిల్‌ను పెడ‌తారా అని ప‌‌వ‌న్ అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూశారు. మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' అనే టైటిల్‌తో పాటు ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ 27వ ప్రాజెక్టుగా వ‌స్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ గ్లింఫ్స్ ను విడుద‌ల చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ బిల్డింగ్ పై నుంచి నౌక‌వైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సీన్ రొమాలు నిక్క‌పొడుచుకునేలా ఉంది.

వీటిని బ‌ట్టి చూస్తుంటే ప‌వ‌న్ మునుపెన్న‌డూ క‌నిపించ‌ని విధంగా స‌రికొత్త పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 17వ శతాబ్దం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ వ‌జ్రాల దొంగ‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం అప్ప‌టి బ్యాక్ డ్రాప్‌లో చార్మినార్ సెట్ ను వేయ‌గా.. సైరా ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ రాజీవ‌న్ ఛార్మినార్ స్పెష‌‌ల్ సెట్ కోసం ప‌నిచేస్తున్నాడు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై ఏఎం ర‌త్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story