నాని వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన నిర్మాత‌.. క్షమాప‌ణలు చెప్పాలి

Producer NattiKumar fires on Nani.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో టికెట్ ధ‌ర‌ల విష‌యం టాలీవుడ్‌లో మ‌రోసారి వివాదాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Dec 2021 2:21 PM IST
నాని వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన నిర్మాత‌.. క్షమాప‌ణలు చెప్పాలి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో టికెట్ ధ‌ర‌ల విష‌యం టాలీవుడ్‌లో మ‌రోసారి వివాదాన్ని రాజేసింది. ఏపీలో థియేట‌ర్ల కంటే ప‌క్క‌నే ఉన్న కిరాణా షాపుల క‌లెక్ష‌న్స్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని హీరో నాని వ్యాఖ్య‌నించాడు. కాగా.. నాని చేసిన వ్యాఖ్య‌ల‌ను నిర్మాత న‌ట్టి కుమార్ త‌ప్పుబ‌ట్టారు. నానికి సినిమా క‌లెక్ష‌న్ల గురించి ఏం తెలుసు..? కాస్త ఆలోచించి మాట్లాడాలంటూ మండిప‌డ్డారు. వెంట‌నే ఏపీ ప్ర‌భుత్వానికి నాని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఏపీలో టికెట్ ధ‌ర‌ల విష‌యంలో తాము ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని చెప్పారు న‌ట్టి కుమార్‌. మ‌రో వైపు ఈ వ్య‌వ‌హ‌రం కోర్టులో న‌డుస్తోంద‌ని, కోర్టు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో తెలియ‌ద‌న్నారు. ఏపీలో టికెట్ ధ‌ర‌లు, షేర్స్‌, క‌లెక్ష‌న్ల గురించి అవ‌గాహ‌న లేకుండానే ఎందుకు ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్ల మిగిలిన సినిమాల‌కు ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. వెంట‌నే నాని ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. ప్ర‌భుత్వాన్ని అవ‌మాన ప‌రిచేలా మాట్లాడ‌కూడ‌ద‌ని.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. కాగా.. ఇప్పుడున్న రేట్ల‌తో ఆయ‌న సినిమాకు వ‌చ్చిన ఇబ్బందేం లేద‌ని.. ప్ర‌భుత్వం నుంచి సానుకూల నిర్ణ‌య‌మే వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు న‌ట్టి కుమార్ చెప్పారు.

Next Story