కోట శ్రీనివాస రావు వ్యాఖ్యలపై ఫైర్ అయిన నట్టి
సినిమాలలో తాను రోజుకు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు.
By M.S.R Published on 8 Jun 2023 6:45 PM ISTకోట శ్రీనివాస రావు వ్యాఖ్యలపై ఫైర్ అయిన నట్టి
సినిమాలలో తాను రోజుకు రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బహిరంగంగా ప్రకటించారు. ప్యాకేజీకి అమ్ముడు పోయే స్థాయి తనది కాదని.. సినిమాలు చేసుకుంటూ వెళితే చాలు కోట్లు ఆర్జించగలనని పవన్ కళ్యాణ్ తన స్టేట్మెంట్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడిన సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు ఇలా రెమ్యునరేషన్ గురించి చెప్పడం సరైన సంప్రదాయం కాదని అన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి హీరోలు సైతం ఏనాడూ తాము ఎంత తీసుకుంటున్నామనే విషయాన్ని వెల్లడించలేదని, కోట్లు తీసుకుంటున్నానని పవన్ చెప్పడం కరెక్ట్ కాదని అన్నారు.
కోట శ్రీనివాసరావు వ్యాఖ్యలపై తాజాగా సినీ నిర్మాత నట్టి కుమార్ తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ నిజాయతీగా ఎంత తీసుకుంటున్నాను, ఎంత ట్యాక్స్ కడుతున్నాను అనే విషయాన్ని చెప్పారని నట్టి కుమార్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఒకరికి రూపాయి ఇచ్చే వ్యక్తే కానీ, ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదని నట్టి కుమార్ అన్నారు. ఆయన నిజాయతీగా ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి ఎంత తీసుకుంటున్నాడనే విషయాన్ని చెప్పారని అన్నారు. కోట రోజుకు మూడు, నాలుగు షిఫ్ట్ లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఫంక్షన్ లో మైక్ ఇచ్చారు కదా అని ఏదో ఒకటి వాగేయడమేనా? అని విమర్శించారు. నిర్మాతలు ఇబ్బంది పడుతున్నప్పుడు కోట ఇంకా ఎంత ఇబ్బంది పెట్టారో తనకు తెలుసని చెప్పారు. కోటకు వయసు పెరిగిపోయిందని, ఆయన హద్దుల్లో ఉంటే మంచిదని సూచించారు.