చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. నిర్మాత మహేశ్ కోనేరు కన్నుమూత
Producer Mahesh Koneru Passed Away.ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటాయి. కరోనా మహమ్మారికి
By తోట వంశీ కుమార్ Published on
12 Oct 2021 6:05 AM GMT

ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటాయి. ఒకరి మరణాన్ని జీర్ణించుకోలేకముందే మరొకరు తుదిశ్వాస విడుస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత మహేశ్ కోనేరు కన్నుమూశారు. ఆయన వయస్సు 38 సంవత్సరాలు. దసరా సెలవులకు స్వస్థలం విశాఖ వెళ్లిన ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లకు వ్యక్తిగత పీఆర్‌గా పనిచేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్‌ను స్థాపించి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. 118, తిమ్మరుసు, మిస్ ఇండియా చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆయన మృతి పట్ల ఎన్టీఆర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఎంతో ఇష్టమైన వ్యక్తి, ప్రియమైన స్నేహితుడు ఇక లేరనే విషయం షాక్‌కు గురి చేసిందని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 'బరువైన హృదయంతో చెబుతున్నా.. నా ఆప్త మిత్రుడు మహేశ్ కోనేరు ఇక లేరు. నాకు మాటలు రావడం లేదు. మహేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
Next Story