తప్పుడు వార్తలు రాస్తే తాటా తీస్తా.. దిల్‌రాజు స్ట్రాంగ్ వార్నింగ్

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  8 Jan 2024 8:00 PM IST
producer, dil raju, serious warning, tollywood,

 తప్పుడు వార్తలు రాస్తే తాటా తీస్తా.. దిల్‌రాజు స్ట్రాంగ్ వార్నింగ్

హనుమాన్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా వక్రీకరించారని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అలాంటి వార్తలను ప్రచారం చేసిన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దిల్‌రాజు రియాక్ట్‌ అవ్వడు.. సాఫ్ట్‌గా ఉంటాడని అనుకుంటాన్నారా?ఇన్నాళ్లు చాలా ఓపిక పట్టాను... కానీ ఇక నుంచి అలా కాదు..నా గురించి తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తానంటూ సీరియస్ అయ్యారు నిర్మాత దిల్‌రాజు.

వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సీలను అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దంటూ దిల్‌రాజు సీరియస్‌గా చెప్పారు. ఇండస్ట్రీలో పక్కనే ఉంటూ మనపై రాళ్లు వేస్తారనీ దిల్‌రాజు అన్నారు. ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదల అవుతుంటాయనీ.. కానీ సంక్రాంతి టైమ్‌లోనే తనపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు దిల్‌రాజు. ఏడు ఎనిమిదేళ్లుగా ఇది నడుస్తోందని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ.. దిల్‌రాజుకు ఏ టైమ్‌లో ఏం చేయాలో తెలుసు అని అన్నారు.. కానీ.. కొందరు చిరంజీవి మాటలను వక్రీకరించారని చెప్పారు. తనపై ఏదో రాసి ఇంపార్టెన్స్‌ పెంచుకోవాలని చూస్తున్నారనీ.. మరొకరిని ఎందుకు వాడుకుంటున్నారని దిల్‌రాజు ప్రశ్నించారు. ఇది అవసరమా అంటూ నిలదీశారు.

ఇన్నాళ్లు ఒపిక పట్టాననీ.. దిల్‌రాజు ఏం రియాక్ట్ అవ్వడని అనుకోవద్దని ఆయన అన్నారు. సాఫ్ట్‌గా వెళ్తాడునుకుంటున్నారా? ఈ రోజు నుంచి ఊరుకునేది లేదు అన్నారు. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్సీలను అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు.. ఇక నుంచి అలా చేస్తే తాట తీస్తానంటూ నిర్మాత దిల్‌రాజు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


Next Story