టాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు, సినీ నిర్మాత కన్నుమూత
Producer Bommireddy Raghavaprasad passes away.టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. గత సంవత్సర కాలంగా
By తోట వంశీ కుమార్ Published on
6 Aug 2021 6:49 AM GMT

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. గత సంవత్సర కాలంగా చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది నటీనటులు ప్రాణాలు కోల్పోగా..మరికొందరు అనారోగ్య సమస్యలతో కాలం చేశారు. తాజాగా ప్రముఖ నటుడు, సినీ నిర్మాత బొమ్మరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం పరిస్థితి విషమించడంతో మరణించారు.
పి.గన్నవరం మండలం రాజులపాలెం మాజీ సర్పంచ్ అయిన ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పలు సినిమాల్లో ఆయన సహాయ నటుడిగా నటించారు. కిరాతుకుడు (చిరంజీవి నటించింది. కాదు) సినిమాలో హీరోగా నటించి, తానే ఆ సినిమాను నిర్మించి విడుదల చేశారు. రూపాయి సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, బంగారు బుల్లోడు, దొంగల బండి, సౌర్య చక్ర, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఇంకా పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. బొమ్మిరెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
Next Story