నిర్మాత‌, న‌టుడు బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిక‌..!

Producer Bandla ganesh tested covid 19 positive admitted to ICU. తాజాగా.. గ‌తేడాది క‌రోనాకు చికిత్స పొంది కోలుకున్న న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ రెండో సారి క‌రోనా బారిన ప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 April 2021 3:33 AM GMT
Bandla Ganesh

దేశంలో ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల వ‌ర‌కు అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా.. గ‌తేడాది క‌రోనాకు చికిత్స పొంది కోలుకున్న న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ రెండో సారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఓసారి కరోనా వచ్చిన తర్వాత రెండోసారి రావడం అరుదుగా జరుగుతుందని డాక్ట‌ర్లు చెబుతున్న.. బండ్ల గణేష్ కు మరోసారి కరోనా పాజిటివ్ లక్షణాలు నిర్ధారణ కావటంతో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.

అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మాత్రం టాలీవుడ్ నుంచి గాని.. ఆయన ఫ్యామిలీ నుంచి ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఇదిలా ఉంటే.. క‌రోనా ప‌స్ట్ వేవ్ స‌మ‌యంలోనూ బండ్ల గ‌ణేష్ క‌రోనాకి గుర‌య్యారు. టాలీవుడ్ సెల‌బ్రెటీల్లో మొద‌ట క‌రోనా పాజిటివ్‌కి గురైన వ్య‌క్తిగా ఆయ‌న పేరు అప్ప‌ట్లో బాగా వినిపించింది. ఇటీవల 'వకీల్‌ సాబ్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో యాక్టివ్‌గా కనిపించారు బండ్ల గణేష్. ఇక ఆయ‌న దేవుడిగా కొలిచే.. ప‌వ‌ర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉండ‌గా.. మరోవైపు నిర్మాత దిల్ రాజుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగ‌తి తెలిసిందే.
Next Story