టాలీవుడ్‌లో విషాదం.. సాయి ప‌ల్లవి మూవీ నిర్మాత మృతి

Producer Annam reddy krishna kumar passes away. తాజాగా నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ క‌న్నుమూశారు.టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 May 2021 3:54 AM GMT
Producer Annam Reddy Krishna Kumar

ఇటీవ‌ల వ‌రుస మ‌రుణాల‌తో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. ప్ర‌ముఖ గాయ‌కుడు జి.ఆనంద్‌, స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ మోహ‌న్ జీతో పాటు ర‌చ‌యిత నంద్యాల ర‌వి, న‌టుడు టీఎన్ఆర్‌, పీఆర్వో బీఏ రాజుల వ‌రుస మ‌ర‌ణాల‌తో చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం నెల‌కొంది. ఇంకా దీని నుంచి తేరుకోక‌ముందే.. తాజాగా నిర్మాత అన్నంరెడ్డి కృష్ణ‌కుమార్ క‌న్నుమూశారు. విశాఖ‌ప‌ట్నంలో నివ‌సిస్తున్న ఆయ‌న ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కృష్ణ కుమార్ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు.

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం "అథిరన్".ఈ సినిమా ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. తెలుగులో అనుకోని అతిథి పేరుతో 2019లో విడుద‌ల కావ‌ల‌సి ఉన్ప్ప‌టికీ ప‌లు కార‌ణాల వల‌న వాయిదా ప‌డింది. మ‌రో రెండు రోజుల్లో ఈ చిత్రం ఆహా ఓటీటీ వేదిక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో నిర్మాత మృతి చెంద‌డంతో చిత్ర‌బృంద‌మే కాకుండా.. మొత్తం టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.


Next Story
Share it