క‌రోనా మందులు ఎక్క‌డివి.. సోనూసూద్‌కు నోటీసులు

Moharashtra govt send notices to sonu sood.తాజాగా సోనూసూద్ కి ముంబై హైకోర్టు ఆదేశం మేర‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2021 9:14 AM GMT
sonu sood

క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి స‌హాయం చేసి రియ‌ల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్. తాజాగా సోనూసూద్ కి ముంబై హైకోర్టు ఆదేశం మేర‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. భారీ మొత్తంలో మందులు కొనుగోలు చేసిన వ్య‌వ‌హారంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.

క‌రోనా క‌ష్ట‌కాలంలో సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు త‌మకు తోచిన విధంగా స‌హాయ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. ప‌లువురు సినీ తార‌లు, రాజ‌కీయ నాయ‌కులు యాంటీ కొవిడ్ డ్ర‌గ్స్ పంపిణీ చేస్తున్నారు. వీటిపై ముంబై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ మందులు వారికి ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌ని ముంబై హైకోర్టు ప్ర‌శ్నించింది. బ్రిటీలకు కోవిడ్ మందులు, ఇంజెక్షన్లు ఎలా వస్తున్నాయో వివరించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ముంబై హైకోర్టు. ఈ సందర్భంగా కోవిడ్ డ్రగ్స్ పై అథారిటీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని హైకోర్టు గుర్తు చేసింది.

ప్రజలకు మంచి చేయాలన్న వారి ఆలోచన మంచిదే, కానీ కేవలం కేంద్రం ప్రభుత్వానికి మాత్రమే అథారిటీ ఉన్న ఈ కోవిడ్ డ్రగ్స్ వారికి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాలని ప్రభుత్వానికి చెప్పింది. ఇందులో ఏదైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతోందా? లేదా అనధికారికంగా మందులు సమకూర్చుకుంటున్నారా? అన్నది విచారణ జరిపి తేల్చాలన్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ముంబై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ, సోనూసూద్ చారిటీ ఫౌండేషన్, ఇతర వ్యక్తులను నోటీసులు జారీ చేసింది.

Next Story