సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌ద‌ల‌నంటున్న క‌రోనా.. అందాల భామ ప్రియాంక జవాల్కర్ పాజిటివ్‌

Priyanka Jawalkar tests positive for Covid-19.క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. సామాన్యులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Jan 2022 12:48 PM IST
సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌ద‌ల‌నంటున్న క‌రోనా.. అందాల భామ ప్రియాంక జవాల్కర్ పాజిటివ్‌

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. సామాన్యులు, సెల‌బ్రెటీలు అన్న తేడాలేకుండా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. ఇక టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ వంటి ప‌రిశ్ర‌మ‌ల‌తో సంబంధం లేకుండా చాలా మంది సినీ ప్ర‌ముఖుల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. తాజాగా మ‌రో హీరోయిన్ క‌రోనా బారిన పడింది. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటించి 'టాక్సీవాలా' ఫేమ్‌ ప్రియాంక జవాల్కర్ కు కరోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది.

ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. అన్ని ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టీకి త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు చెప్పింది. డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు మందులు వాడుతూ హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపింది. ఇటీవ‌ల కాలంలో త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించింది. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని, మాస్కులు ధ‌రించాల‌ని, అవ‌సర‌మైయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్ద‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో ప్రియాంక జ‌వాల్క‌ర్ పేర్కొంది.


ఇక సినిమాల విష‌యానికి టాక్సివాలా చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక 'తిమ్మరుసు', 'ఎస్ ఆర్ కల్యాణమండపం' చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకుంది.

Next Story