ఆసుపత్రి పాలైన ప్రియాంక చోప్రా భర్త

Priyanka Chopra's husband hospitalized, Nick Jonas suffers injury during shoot. నిక్ జోనస్ ఆసుత్రిలో చేరాడు. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో 'ది వాయిస్‌' షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

By Medi Samrat  Published on  17 May 2021 9:07 AM GMT
Priyanka chopra hospitalized

ప్రియాంక చోప్రా కరోనాతో కష్టాలు పడుతున్న భారత్ కు సహాయం అందించడానికి తన వంతుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ప్రియాంక చోప్రా, తన భర్త నిక్‌ జోనస్‌ కలిసి కోవిడ్‌ బాధితుల కోసం 'టుగెదర్‌ ఇండియా' అంటూ విరాళాలు సేకరిస్తున్నారు. నిక్ జోనాస్ పాప్ సింగర్ మాత్రమే కాదు.. నటుడు కూడా..! హాలీవుడ్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. రియాలిటీ షోలలో కూడా జడ్జ్ గా ఉన్నాడు. తాజాగా నిక్ జోనాస్ ఆసుపత్రి పాలయ్యాడన్న వార్త నిక్-ప్రియాంక అభిమానులను కలవరపెడుతోంది.

నిక్ జోనస్ ఆసుత్రిలో చేరాడు. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో 'ది వాయిస్‌' షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. గాయాలు పెద్ద‌వేమి కాక‌పోవ‌డంతో డాక్టర్ల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యాడు. 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రియాంక కంటే నిక్‌ పదేళ్లు చిన్న వాడని తెలిసి అందరూ షాక్ అయ్యారు.

ప్రియాంక చోప్రా తన వయసుపైనా, శరీరంపైనా ఇటీవలే కీలక కామెంట్లు చేసింది. ఆమె వయసు 38 సంవత్సరాలు.. ఆమె శరీరాకృతిపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కామెంట్లపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను మానసికంగా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. శారీరక మార్పులతో తాను ఇబ్బంది పడటం లేదనే అబద్ధాన్ని తాను చెప్పలేనని స్పష్టం చేసింది. వయసు పెరుగుతున్నందున తన శరీరం చాలా మార్పులకు గురైందని.. మిగతా వారి శరీరాల మాదిరే తన శరీరం కూడా మార్పు చెందుతోందని ఆమె చెప్పుకొచ్చింది. వయసుతో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందేనని... తాను కూడా తన శారీరక మార్పులను స్వీకరిస్తున్నానని తెలిపింది.


Next Story