స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా.. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మ

Priyanka Chopra welcome baby via surrogacy.గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా త‌న అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 3:32 AM GMT
స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా.. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మ

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా త‌న అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. వ‌య‌సులో త‌న‌కంటే చిన్న‌వాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక‌.. తాజాగా తాను తల్లి అయిన‌ట్లు తెలిపింది. స‌రోగ‌సీ ద్వారా బిడ్డ‌కు త‌ల్ల‌యిన‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది.

'స‌రోగ‌సీ ద్వారా బిడ్డ‌ను కుటుంబంలోకి తీసుకొచ్చిన‌ట్లు చెప్ప‌డానికి చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబంపై ఫోక‌స్ పెడుతున్న ఈ స‌మ‌యంలో మాకు ప్రైవ‌సీ ఇవ్వాల‌ని అడుగుతున్నాం. థ్యాంక్యూ సో మ‌చ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక పోస్టు పెట్టింది. ఇక ఇదే విష‌యాన్ని నిక్ జోనాస్ కూడా సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

ప్రియంక చోప్రా, నిక్ లు 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి రెండేళ్లు దాటింది. అయితే ఈ దంపలిద్దరూ ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో పిల్లల గురించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు. అయితే.. ఇటీవ‌ల‌ 39వ పడిలో పడిన ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిల్లలు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పిల్లలు తమ జీవితంలో పెద్ద భాగం అవుతారన్నారు. దేవుని దయతో అది అయినప్పుడే అవుతుందన్నారు. ఈ క్ర‌మంలో స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

Next Story
Share it