ఢిల్లీ చేరుకున్న ప్రియాంక చోప్రా.. అందుకేనట..!
Priyanka Chopra reaches Delhi for Parineeti Chopra and Raghav Chadha's engagement
By Medi Samrat
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా నిశ్చితార్థానికి నటి ప్రియాంక చోప్రా శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ప్రియాంక విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ప్రియాంక శనివారం నాడు ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో పరిణీతి చోప్రా, రాఘవ్ ల నిశ్చితార్థానికి హాజరుకానున్నారు. రాఘవ్ చద్దా ఇంటిని పువ్వులు, లైట్లతో ఇప్పటికే అలంకరించారు. ముంబైలోని పరిణీతి ఇంటిని కూడా లైట్లతో అలంకరించడంతో వారి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. వార్తా సంస్థ ANI ప్రకారం శనివారం సాయంత్రం 5 గంటలకు ఎంగేజ్మెంట్ ప్రారంభమవుతుంది. సిక్కు ఆచారాల ప్రకారం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. ఈ వేడుకలో ప్రియాంకతో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొననున్నారు.
మార్చిలో ముంబైలో లంచ్ డేట్‌లో పరిణీతి, రాఘవ కలిసి కనిపించారు. అప్పటి నుండి వారి రిలేషన్ షిప్ గురించి పుకార్లు మొదలయ్యాయి. అప్పటి నుండి, వారు చాలా సందర్భాలలో కలిసి కనిపించారు. వారి రిలేషన్ షిప్ గురించి అడిగినప్పుడు పరిణీతి, రాఘవ్ వాటిని ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. చాలా సార్లు పరిణీతి నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. పరిణీతి- రాఘవ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కలిసి చదువుకున్నారు. వారు చాలా కాలంగా స్నేహితులు. సినిమాల పరంగా ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన చమ్కిలాలో దిల్జిత్ దోసాంజ్‌తో కలిసి పరిణీతి కనిపించనుంది.