కన్నుగీటిన భామ కిందపడిపోయింది.. వీడియో వైరల్
Priya Prakash Varrier shared funny video.ఒరు ఆదార్ లవ్ అనే సినిమాలోని ఓ పాటలో కన్ను గీటుతో కోట్లాది
By తోట వంశీ కుమార్ Published on 26 Feb 2021 10:52 AM IST'ఒరు ఆదార్ లవ్' అనే సినిమాలోని ఓ పాటలో కన్ను గీటుతో కోట్లాది మంది కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. చూడచక్కని అందంతో పాటు ఆకట్టుకునే అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. టాలీవుడ్‌లో 'చెక్' సినిమాతో అలరించేందుకు సిద్దమైంది. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియా ప్రకాశ్ కోసం సినిమాలకు వెళ్లే అభిమానులు చాలా మందే ఉన్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియా ప్రకాశ్ ఓ వీడియోను షేర్ చేసింది. చెక్ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ఓ ఫన్ని ఇన్సిడెంట్‌ను అభిమానులతో పంచుకుంది. ఓ షాట్‌లో నితిన్ పరిగెత్తుకుంటూ రాగా.. వెనక నుంచి వచ్చిన ప్రియా ప్రకాశ్ ఎగిరి నితిన్ వీపుపై ఎక్కాల్సి ఉంది. ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ కేరళ కుట్టి పట్టుతప్పి కిందపడిపోయింది. ఆమెకు ఎమైందోనని కంగారుగా వచ్చిన చిత్రబృందం ఆమెను లేపగా ఆమె మాత్రం చిరునవ్వులు చిందించింది. నితిన్ ఓకేనా అని అడుగగా.. థంబ్ ను చూపిస్తూ.. తాను బాగానే ఉన్నట్లు చెప్పింది. ఇంకేందుకు ఆలస్యం మీరు ఓ సారి ఆ వీడియోను చూసేయండి.
బన్నీ సినిమాను రిజెక్ట్ చేసిందా..?
ప్రస్తుతం తెలుగులో పలు ప్రాజెక్ట్స్‌కు ప్రియా ప్రకాశ్ సైన్ చేసినట్టు తెలుస్తుండగా.. అల్లు అర్జున్ సినిమాను రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ప్రియాంక ప్రకాశ్ వారియర్ స్పందించింది. మలయాళంలో అల్లు అర్జున్ నటించిన డబ్బింగ్ మూవీస్ విడుదల కాగా అవి చిన్నప్పటి నుండి చూస్తూ వచ్చాను. ఆయనపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. నాకు బన్నీ సినిమా ఆఫర్ వచ్చిందని, దానిని నేను రిజెక్ట్ చేసానని వస్తున్న వార్తలలో నిజం లేదు. బన్నీతో నటించే ఛాన్స్ వస్తే తప్పక నటిస్తాను చెప్పుకొచ్చింది ప్రియా ప్రకాశ్.