హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న 'ప్రిన్స్‌'.. ఎప్పటినుంచంటే?

Prince Movie will release in Hotstar on 25th november. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ప్రిన్స్‌'. దీపావళి కానుకగా

By అంజి  Published on  15 Nov 2022 2:43 PM IST
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ప్రిన్స్‌.. ఎప్పటినుంచంటే?

కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ ప్రధాన పాత్రలో నటించిన మూవీ 'ప్రిన్స్‌'. దీపావళి కానుకగా అక్టోబర్‌ 21న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆడలేదు. ఉక్రేనియన్‌ నటి మరియా.. శివకార్తికేయన్‌కు జోడీగా నటించింది. ఈ మూవీలో సత్యరాజ్‌ కీలక పాత్రలో నటించారు. యువ దర్శకుడు అనుదీప్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. నవంబర్‌ 25 నుండి హాట్‌స్టార్‌లో 'ప్రిన్స్‌' సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

సునీల్ నారంగ్,సురేశ్ బాబు, రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మించారు. ఎస్‌ఎస్‌ థమన్‌ ఈ మూవీకి మ్యూజిక్‌ అందించాడు. 'జాతిరత్నాలు' హిట్‌ డైరెక్టర్ అనుదీప్‌ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. 'ప్రిన్స్'పై అంచనాలు పెరిగాయి. ఇక అనుదీప్ సైతం తాను నమ్ముకున్న కామెడీ ఆధారంగానే ఈ సినిమాను రూపొందించాడు. అయితే సినిమాలో కామెడీ ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో కలెక్షన్లు కూడా ఈ మూవీ ఎక్కువగా రాబట్టలేకపోయింది. మరి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాల్సి ఉంది..

Next Story