పుట్టిన రోజు నాడు 'ప్రేమ కాదంటున్న' శిరీష్‌

Prema Kadanta movie first look viral.నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 May 2021 6:42 AM GMT
పుట్టిన రోజు నాడు ప్రేమ కాదంటున్న శిరీష్‌

నిర్మాత అల్లు అర‌వింద్ త‌న‌యుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్నా సరైన హిట్ మాత్రం కొట్టలేక పోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు చిత్రాలు చేసినా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయాడు. ప్రస్తుతం అల్లు శిరీష్.. రాకేష్ శశి దర్శకత్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు. రాకేష్ గతంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ తో విజేత సినిమా తీశారు. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి గ‌త రెండు రోజులుగా ఫ్రీలుక్స్‌తో హ‌ల్ చ‌ల్ చేసింది చిత్ర‌బృందం. ఆ రెండు ఫ్రీ లుక్స్ ఇంటెన్స్‌గానే ఉన్నాయి.

తాజాగా నేడు అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మూవీ టైటిల్ ను తెలుపుతూ రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లలో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ ఆసక్తికరంగా ఉంది. ఒక పోస్టర్ లో అనును శిరీష్ ముద్దు పెడుతూ సెల్ఫీ తీసుకుంటున్నారు. మరో పోస్టర్లో ప్రేమలో మునిగి తేలుతున్నారు. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త దృక్పథాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. GA2 మూవీస్, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనుప్ రూబెన్స్, అచు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


Next Story
Share it