ఆస్ప‌త్రిలో చేరిన ఆలియా భ‌ట్‌

Pregnant Alia Bhatt Admitted To Hospital.బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ఆస్ప‌త్రిలో చేరారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Nov 2022 11:43 AM IST
ఆస్ప‌త్రిలో చేరిన ఆలియా భ‌ట్‌

బాలీవుడ్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ ఆలియా భ‌ట్ ఆస్ప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆమె నిండు గ‌ర్భిణీ. ఆదివారం ఉద‌యం 7.30 గంట‌ల స‌మ‌యంలో ముంబైలోని రిల‌య‌న్స్ ఆస్ప‌త్రిలో చేరారు. ఆమె వెంట భ‌ర్త ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో పాటు నీతూ క‌పూర్‌, సోనీ ర‌జ్ధాన్, షాహిన్ భ‌ట్ కూడా ఉన్నారు. మ‌రికొద్ది గంట‌ల్లో ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతుంది. శుభ‌వార్త కోసం క‌పూర్ ఫ్యామిలీ అంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.


ప్ర‌ముఖ ద‌ర్శ‌క,నిర్మాత మ‌హేష్ భ‌ట్ గారాల ప‌ట్టి ఆలియా భ‌ట్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇరు కుటుంబాలు, స‌న్నిహితులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఒక్క‌టి అయ్యారు. కాగా.. వివాహం జ‌రిగిన రెండు నెల‌ల‌కే ఆలియా ప్రెగ్నెన్సీ అని చెప్పింది. ప్రెగ్నెంట్‌గా ఉన్నా షూటింగ్స్‌తో పాటు ప్ర‌మోష‌న్స్‌లోనూ ఆమె యాక్టివ్‌గా పాల్గొంది. త‌న ప్రెగ్నెన్సీ కార‌ణంగా షూటింగ్ ల‌కు బ్రేక్ రాకుండా క‌మిట్‌మెంట్ ఇచ్చిన సినిమాల‌ను పూర్తి చేసింది.

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 'చిత్రంతో తెర‌గ్రేటం చేసింది ఆలియా. ఆ త‌రువాత 'డియ‌ర్ జింద‌గీ', 'హైవే', 'రాజీ', 'బ్ర‌హ్మ‌స్త్ర' వంటి చిత్రాల్లో న‌టించి త‌న కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ చిత్రం 'హార్ట్ ఆఫ్ స్టోన్‌'లోనూ న‌టిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే పూర్తి అయింది. త్వ‌ర‌లోనే ఈ చిత్రం నెట్‌ఫిక్ల్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Next Story