ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ప్రసన్న వదనం'

కొత్త కొత్త కాన్సెప్ట్ లతో.. సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో 'సుహాస్'. అతడు నటించిన 'ప్రసన్నవదనం' సినిమా కొన్ని వారాల కిందటే థియేటర్లలోకి వచ్చింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 May 2024 1:45 PM IST
Prasanna Vadanam, Ott , suhas movie

ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ప్రసన్న వదనం' 

కొత్త కొత్త కాన్సెప్ట్ లతో.. సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో 'సుహాస్'. అతడు నటించిన 'ప్రసన్నవదనం' సినిమా కొన్ని వారాల కిందటే థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ఎలక్షన్స్ సందడి.. ఐపీఎల్ క్రేజ్ ను తట్టుకుని కూడా మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి కూడా రావడానికి సిద్ధమైంది. ఈ సినిమాను ఆహాలో డిజిటల్ ప్రీమియర్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న ఆహా.. ప్రీమియర్ డేట్ ను ఖరారు చేసింది.

సుహాస్, పాయల్ రాధాకృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డ్రామా చిత్రం ప్రసన్న వదనం. Y. K. అర్జున్ దర్శకత్వం వహించారు. ఇది గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ సినిమా. ముఖాలను గుర్తించలేని హీరోకు ఎదురయ్యే సవాళ్ళను ఈ సినిమాలో చూపించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది . ప్రసన్న వదనం ఓటీటీలలో కూడా మంచి ప్రదర్శన ఇస్తుందని భావిస్తున్నారు. సుహాస్-నటించిన ఈ చిత్రం మే 24, 2024న ‘ఆహా’లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ‘లిటిల్ థాట్స్ సినిమాస్’ ఈ సినిమాను నిర్మించింది. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చారు.

Next Story