పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన బాపు బొమ్మ‌

Pranitha Subhash blessed with a baby girl.హీరోయిన్ ప్ర‌ణీత పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని త‌నే సోష‌ల్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2022 9:21 AM IST
పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన బాపు బొమ్మ‌

హీరోయిన్ ప్ర‌ణీత పండంటి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని త‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. కూతురిని పొత్తిళ్ల‌లోకి తీసుకున్న ఫోటోను అభిమానుల‌తో పంచుకుంది. కుమారై పుట్టిన‌ప్ప‌టి నుంచి అంతా ఓ క‌ల‌లా ఉందంటూ రాసుకొచ్చింది. 'పాప పుట్టినప్పటి నుంచి అంతా కలగా అనిపిస్తోంది. గైనకాలజిస్ట్‌ అయిన తల్లి ఉండటంం నిజంగా నా అదృష్టం. కానీ మానసికంగా మాత్రం ఆమెకు ఇది చాలా కష్ట సమయం. నా డెలివ‌రీ తేలిక‌గా అయ్యేలా చేసిన డాక్టర్‌ సునీల్‌ ఈశ్వర్‌, అతడి టీమ్ కి ధ‌న్య‌వాదాలు. ' అంటూ వైద్యులతో దిగిన పలు ఫొటోలు షేర్‌ చేసింది. అయితే.. ఫోటోల్లో ఎక్క‌డా త‌న కుమారై ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. నెటీజ‌న్లు ప్ర‌ణీత‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

'పోక్రీ' అనే క‌న్న‌డ చిత్రంతో న‌టీగా సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ప్ర‌ణీత.. 'ఏం పిల్లో ఏం పిల్ల‌డో' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. 'బావ‌', 'అత్తారింటికి దారేది', 'ర‌భ‌స‌' వంటి చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క‌న్న‌డ‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అభిమానులంతా ప్ర‌ణీత‌ను ముద్దుగా బాపుబొమ్మ అని పిలుచుకుంటారు. కాగా.. గతేడాది మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును ప్ర‌ణీత పెళ్లాడింది. లాక్‌డౌన్‌లో ఎంతో మందికి సాయం చేసి త‌న మంచి మ‌న‌సును చాటుకుంది.


Next Story