'ధురందర్'పై ప్రశంసలు.. టాలీవుడ్ హీరోలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
సినిమా ప్రపంచంలో 'ధురందర్: ది రివేంజ్' (Dhurandhar: The Revenge) చిత్రం చుట్టూ ఇప్పుడు పెను వివాదం రేగుతోంది.
By - అంజి |
'ధురందర్'పై ప్రశంసలు.. టాలీవుడ్ హీరోలపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
సినిమా ప్రపంచంలో 'ధురందర్: ది రివేంజ్' (Dhurandhar: The Revenge) చిత్రం చుట్టూ ఇప్పుడు పెను వివాదం రేగుతోంది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంపై నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురందర్: ది రివేంజ్' చిత్రంపై నటుడు ప్రకాష్ రాజ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పాత హిందీ పాట వీడియోను షేర్ చేస్తూ, "నేను ధురందర్‌కు చాలా దూరంలో ఉన్నాను.. మీరు?" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ సినిమా కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం తీసిన 'ప్రోపగాండా' (ప్రచార) చిత్రమని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి వారు ప్రశంసించడంపై ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. "బాలీవుడ్ స్టార్లెవరూ ట్వీట్ చేయని ఈ సినిమాను సౌత్ హీరోలు ఎందుకు పొగుడుతున్నారు?" అని ఒక నెటిజన్ వేసిన పోస్ట్‌ను ఆయన రీ-ట్వీట్ చేస్తూ.. "కృతజ్ఞతలు తీర్చుకోవాల్సిన అవసరాలు ఇప్పుడు సౌత్‌కు కూడా పాకాయి" అంటూ ఘాటుగా స్పందించారు.
Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K
— Prakash Raj (@prakashraaj) March 19, 2026
మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ధురందర్' చిత్రం చాలా గ్రిప్పింగ్‌గా ఉందని, రణవీర్ సింగ్ నటన అద్భుతమని ఆయన కొనియాడారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి నటుల పెర్ఫార్మెన్స్‌ను కూడా చరణ్ అభినందించారు. అయితే, ఈ సినిమాపై యూట్యూబర్ ధ్రువ్ రాథీ కూడా విమర్శలు చేశారు. ఆదిత్య ధర్ ఒక ప్రచారకర్తగా మారిపోయారని, ఈ సినిమా ఏమాత్రం బాగా లేదని ఆయన ఎద్దేవా చేశారు.
2025 డిసెంబర్‌లో వచ్చిన 'ధురందర్' చిత్రానికి ఇది సీక్వెల్. జియో స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 19, 2026న విడుదలైంది. పవన్ కళ్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో పోటీగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పై థ్రిల్లర్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.