బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నేడు CID ముందు నటుడు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2016లో తాను బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశానని.. 2017లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించారని తెలిపారు. నిషేదం అనంతరంతాను రియలైజ్ అయ్యినట్లు తెలిపారు. ఆ తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయలేదన్నారు.
యంగ్‌స్టర్స్‌కి కూడా అదే చెప్తున్నా.. కష్టపడి డబ్బు సంపాదించండి.. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండని సూచించారు. నేను తప్పు చేయలేదు అనడం లేదు.. తెలిసి చేసినా.. తెలియక చేసినా.. తప్పు తప్పే.. ఇకపై చేయను అని స్పష్టం చేశారు. అన్ని వివరాలు CID అధికారులకు సమర్పించినట్లు తెలిపారు. ED విచారణ కూడా ఎదుర్కొన్నాను.. బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చినట్లు తెలిపారు.