బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌ రాజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

By Knakam Karthik
Published on : 30 July 2025 10:48 AM IST

Cinema News, Betting Apps Case, Actor Prakash Raj, ED

బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌ రాజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి బుధవారం ఉదయం చేరుకున్నారు. బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ కేసుకు సంబంధించి అధికారులు పంపించిన నోటీసులకు ఆయన స్పందించారు. ఇందులో భాగంగానే ఈ రోజు విచారణ కోసం అధికారుల ముందు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు.. మొత్తం 29 మందికి ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు పంపించారు. బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో మనీలాండరింగ్ వ్యవహారం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.


Next Story