ప్ర‌భుదేవా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Prabhudeva quits film direction post.కొరియోగ్రాఫ‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాడు ప్ర‌భుదేవా. డ్యాన్స‌ర్‌గా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Sep 2021 6:57 AM GMT
ప్ర‌భుదేవా సంచ‌ల‌న నిర్ణ‌యం..!

కొరియోగ్రాఫ‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటాడు ప్ర‌భుదేవా. డ్యాన్స‌ర్‌గా వ‌చ్చిన విప‌రీత‌మైన క్రేజ్‌తో ఆయ‌న హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించారు. హీరోగా బిజీగా ఉన్న స‌మ‌యంలోనే ఆయ‌న డైరెక్ష‌న్ వైపు దృష్టి పెట్టారు. తెలుగులో రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి విజ‌య‌వంతం అయ్యారు. ఆ త‌రువాత ఎక్కువ‌గా బాలీవుడ్ చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాలు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది.

దాంతో ప్రభుదేవా తిరిగి చెన్నైకు చేరుకున్నారు. అయితే.. ఆయ‌న ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. ఇక‌పై ద‌ర్శ‌క‌త్వం చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార‌ని.. పూర్తిగా న‌ట‌న‌పైనే దృష్టి పెట్టనున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Next Story