ప్ర‌భాస్ ఆదిపురుష్ లుక్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

Prabhas's latest adipurush look wins internet.తాజాగా ఆది పురుష్ సినిమాలో ప్ర‌భాస్ లుక్ ఇదేనంటూ ప్ర‌భాస్‌కు సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Feb 2021 2:43 PM IST
Prabhass latest Adipurush look wins the internet

'బాహుబలి'తో చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రెబ‌ల్ స్టార్ ప్రభాస్. వరుసగా భారీ ప్రాజెక్టులు చేప‌ట్టి పూర్తి చేస్తున్నాడు. ఆయ‌న న‌టించిన 'రాధే శ్యామ్' రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ఇటీవలే 'సలార్' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నాగ్ అశ్విన్‌తో చేస్తున్న మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆదిపురుష్'లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా ప్రకటించినప్పటి నుండి రాముడిగా ప్రభాస్ ఇలా ఉంటాడు అంటూ పలు ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ద‌ర్శ‌న‌మిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్ర‌వరి 2 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభ‌మైంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ లుక్ మాత్రం బ‌య‌టికి రాలేదు. తాజాగా ఆది పురుష్ సినిమాలో ప్ర‌భాస్ లుక్ ఇదేనంటూ ప్ర‌భాస్‌కు సంబంధించిన ఓ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆదిపురుష్ సినిమా షూటింగ్‌లో పాలుపంచుకున్న ఓ అభిమాని ప్ర‌భాస్‌తో దిగిన ఫోటో అది.


ఈ ఫోటోలో ప్ర‌భాస్ క‌ళ్లద్దాలు పెట్టుకుని మీస‌క‌ట్టుతో భ‌లే ఉన్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మీస క‌ట్టు ఉంది.. కానీ గ‌డ్డం లేదు.. అదే లుక్ అంటూ ప్ర‌భాస్ ఫోటోతో పాటు ఆదిపురుష్ ఫోటోను షేర్ చేస్తున్నారు. రావ‌ణాసురుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తుండగా.. టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించారు.






Next Story