ప్ర‌భాస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రాధేశ్యామ్ అప్డేట్ వ‌చ్చేసింది

Prabhas Unveils New Release Date of Radhe Shyam.చాలా కాలం త‌రువాత ప్ర‌భాస్ న‌టిస్తున్న పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 4:22 AM GMT
ప్ర‌భాస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. రాధేశ్యామ్ అప్డేట్ వ‌చ్చేసింది

చాలా కాలం త‌రువాత ప్ర‌భాస్ న‌టిస్తున్న పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రం రాధేశ్యామ్‌. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోంది. ప్యాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నిజానికి జులై 30న( ఈరోజు) ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సి ఉండ‌గా.. క‌రోనా కార‌ణంగా చిత్ర షూటింగ్ ఆల‌స్యం కావ‌డంతో వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ ప్రారంభించ‌గా.. గురువారం షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ నేప‌థ్యంలో చిత్ర‌బృందం కొత్త రిలీజ్ డేట్ అప్‌డేట్ ఇచ్చేసింది.

సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నట్లు మేక‌ర్లు ప్ర‌క‌టించారు. కొద్దిగా ఆల‌స్య‌మైనా సెల‌బ్రేష‌న్స్ మాత్రం పీక్స్‌లో ఉంటాయ‌ని అభిమానులు అంటున్నారు. వింటేజ్ ప్రేమ‌క‌థా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇక ఈ సినిమా హిందీ హక్కులు మినహా మిగతా ముఖ్య భాషల హక్కులు అన్నీజీ5 సంస్థ కొనుగోలు చేశారట. అయితే థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే రాధేశ్యామ్‌ను జీ5లో ప్రసారం చేయనున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు వర్షన్‌కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. రాధేశ్యామ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో రాధే శ్యామ్ విడుదల కానుంది.

Next Story