బరువెక్కిన హృద‌యంతో ఆస్ప‌త్రిలో ప్రభాస్.. వీడియో వైరల్

Prabhas spotted in hospital video goes viral.తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మూగ‌బోయింది. రెబ‌ల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానుల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sept 2022 9:41 AM IST
బరువెక్కిన హృద‌యంతో ఆస్ప‌త్రిలో ప్రభాస్.. వీడియో వైరల్

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మూగ‌బోయింది. రెబ‌ల్‌స్టార్‌గా ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్న కృష్ణంరాజు క‌న్నుమూశారు. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలిసి కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతుండ‌గా.. అభిమానులంతా శోక‌సంద్రంలో మునిగిపోయారు.

గ‌తంలో ప‌లుమార్లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కృష్ణంరాజు ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సారి కూడా ఆయ‌న ఆరోగ్యంగా తిరిగి వ‌స్తార‌ని బావించారంతా. అయితే.. ఇంత‌లోనే ఆయ‌న లేర‌నే వార్త షాక్‌కు గురి చేసింది. ఇక పెద‌నాన్న కృష్ణంరాజ్‌తో ప్ర‌భాస్‌కు ఎంతో అనుబంధం ఉంది.

పెద‌నాన్న కృష్ణం రాజును చూసేందుకు ప్ర‌భాస్ నిన్న‌(శ‌నివారం) ఏఐజీ ఆస్ప‌త్రి వెళ్లారు. ఆస్ప‌త్రి నుంచి ప్ర‌భాస్ బ‌య‌ట‌కు వ‌స్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.

కృష్ణంరాజు మృతి చెందిన నేప‌థ్యంలో ప్రభాస్, కృష్ణం రాజు కలిసి ఉన్న పాత వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. సోమ‌వారం కృష్ణంరాజు అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఆ కోరిక తీర‌కుండానే..

ప్ర‌భాస్ పెళ్లి చేసుకుంటే చూడాల‌ని ఉంద‌ని కృష్ణంరాజు ప‌లుమార్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ కోసం జోడి వెతుకుతున్నామ‌ని, పెళ్లికి సంబంధించిన శుభ‌వార్త త్వ‌ర‌లో చెబుతామ‌ని అంటుండేవారు ప్ర‌భాస్ పెళ్లికంటే సంతోషాన్నిచ్చే అంశం త‌న‌కు మ‌రొక‌టి లేద‌ని చెప్పేవారు. వీలైతే ప్ర‌భాస్ పిల్ల‌ల‌తోనూ న‌టించాల‌ని ఉంద‌ని ఆయ‌న త‌న కోరిక‌ను వెల్ల‌డించారు.

Next Story