ఇంట్లో పూజగది ఉందని.. గుడికి వెళ్లడం మానేస్తామా..? : ప్రభాస్
Prabhas speech in Sita Ramam Movie pre release event.ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? మా సినిమా రంగానికి
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2022 6:49 AM ISTఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా? మా సినిమా రంగానికి థియేటరే గుడి. ఆ గుడి ప్రేక్షకులు ఇచ్చిందే అని గ్లోబల్ స్టార్ ప్రభాస్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన 'సీతా రామం' ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హనురాఘవపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రష్మిక మందన్న, సుమంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో తొలి టికెట్‌ను కొన్న అనంతరం ప్రభాస్ మాట్లాడుతూ.. "మా సినిమా రంగానికి థియేటరే గుడి. ఆ గుడి ప్రేక్షకులు ఇచ్చిందే. ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా..? గొప్ప నటులు, సాంకేతిక బృందం కలిసి చేసిన ఈ చిత్రాన్ని అందరం థియేటర్లలోనే చూద్దా"మని అన్నారు . నిర్మాత అశ్వినీదత్ గారు గొప్ప నిర్మాత. ఆయన వంటి వారు తెలుగు ఇండస్ట్రీలో ఉండటం మన అదృష్టమని చెప్పారు. దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ దుల్కర్, మృణాల్ నటన గురించి చెబుతున్నారు. చూడాలనే ఆసక్తి కలుగుతోంది. ఇందులో ప్రేమకథే కాదు, యుద్ధంతో పాటు ఇతర అంశాలూ ఉన్నాయన్నారు.
నన్ను నేను సంస్కరించుకోవడానికి ఈ చిత్రం ఎంతో ఉపయోగపడిందని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. ఈ చిత్ర మేకింగ్‌లో ఉన్న వాళ్ల వల్ల చాలా ఎదిగాను. ఒక మెట్టు ఎక్కాను. అది విడుదల రోజు అంతా చూస్తారు. స్వప్నదత్ ఇచ్చిన సహకారం గొప్పది. ఈ చిత్రం చూశాక మనసుకు నచ్చిన బంధువలతో కలిసి రెండున్నర గంటలు గడిపనట్టుగా ఉంటుంది. మళ్లీ మళ్లీ థియేటర్ కు వచ్చి చూస్తారన్నారు.
1965 బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.