'స్పిరిట్' కోసం ప్ర‌భాస్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

Prabhas Shocking Remuneration for Sandeep Reddy spirit movie.బాహుబ‌లి చిత్రంతో ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Oct 2021 7:10 AM GMT
స్పిరిట్ కోసం ప్ర‌భాస్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..?

'బాహుబ‌లి' చిత్రంతో ప్ర‌భాస్ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌రుస‌గా చిత్రాల‌ను చేస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వీటిలో రెండు చిత్రాలు సెట్స్‌పై ఉండ‌గా.. మ‌రో రెండు చిత్రాల షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్నాయి. వీటిలో ఓ చిత్రానికి అర్జున్‌రెడ్డి రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌భాస్ కెరీర్‌లో 25వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి 'స్పిరిట్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. భారీ యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్‌, సందీప్‌ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. మొత్తం 8 బాష‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఓవార్త బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్ర‌భాస్ ఏకంగా రూ.150 కోట్లను పారితోషికంగా తీసుకుంటున్నాడ‌ట‌. కాగా.. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకునే హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే.. సౌత్ కు చెందిన ఓ హీరో ఏకంగా రూ.150కోట్ల రెమ్మున‌రేష‌న్ తీసుకోవ‌డం అనేది సాధార‌ణ విష‌య‌మేమి కాదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. వీరి అంచ‌నాల‌ను చిత్రం ఏ మేర‌కు అందుకుంటుందో చూడాలి.


Next Story
Share it