వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో 'సలార్' విడుద‌ల‌

Prabhas Salaar Movie Theatrical Release on April 14th 2022.పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న 'సలార్' విడుద‌ల‌ వ‌చ్చే ఏడాది .

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 9:59 AM GMT
Salar movie release update

పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న ప‌వ‌ర్‌పుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం 'స‌లార్‌'. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది. క‌న్న‌డ యాక్ట‌ర్ మ‌ధు గురుస్వామి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల కొద్ది రోజుల పాటు తెలంగాణలోని రామ‌గుండం బొగ్గు గన‌ల్లో ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. ఆ మ‌ధ్య‌కాలంలో లీకైన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. బొగ్గు గ‌నుల్లో ప‌నిచేసే నాయ‌కుడి పోరాటం నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. క‌థ‌కి త‌గ్గ‌ట్టే టైటిల్ విష‌యంలో బ్లాక్ క‌ల‌ర్ ప్యాట్ర‌న్‌ని ఫాలో అవుతోంది చిత్ర బృందం. టైటిల్ నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్ బ్లాక్ బోర్డు ప్యాట్ర‌న్‌ను వాడుతోంది.

కాగా ఇటీవల తెలుగు సినిమాల థియేట్రికల్ రిలీజ్ తేదీలు వరుసగా ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా 'రాధే శ్యామ్' విడుదల తేదీని ప్రకటించిన ప్రభాస్.. తాజాగా ఆయన నటిస్తున్న 'సలార్' సినిమా థియేట్రికల్ రిలీజ్ తేదీని ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాలకు రివీల్ చేస్తున్నట్టుగా చిత్రబృందం తెలిపింది. అన్న‌ట్లుగానే చిత్ర బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న ( 14-04-2022)విడుద‌ల కానుంది. ఈ సినిమాలతో పాటుగా ప్రభాస్ 'ఆదిపురుష్' లో కూడా బాగా బిజీగా ఉన్నాడు.
Next Story