కృతిస‌న‌న్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్ నిజం చెప్పాడుగా.. ఇక‌నైనా

Prabhas reacts on dating Kriti Sanon rumors on Unstoppable 2.బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్‌షో 'అన్ స్టాప‌బుల్ 2'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Dec 2022 1:27 PM IST
కృతిస‌న‌న్‌తో డేటింగ్‌.. ప్ర‌భాస్ నిజం చెప్పాడుగా.. ఇక‌నైనా

నంద‌మూరి నట‌సింహం బాల‌కృష్ణ హోస్ట్‌గా చేస్తున్న టాక్‌షో 'అన్ స్టాప‌బుల్ 2'. ఈ షోకి బాహుబ‌లి ప్ర‌భాస్ రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ చెప్పిన దాని కంటే ఒక రోజు ముందుగానే ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. బాల‌య్య‌, ప్ర‌భాస్‌ల మ‌ధ్య సాగిన సంభాష‌ణ‌లు అభిమానుల‌ను క‌ట్టిప‌డేస్తున్నాయి. ప్ర‌భాస్ పెళ్లి, ప్రేమ గురించి బాల‌య్య అడ‌గ్గా.. డార్లింగ్ త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చాడు.

పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని బాల‌య్య అడుగ‌గా.. "ఇక్క‌డ రాసి పెట్టి లేదు సార్‌.. లేదంటే ఈ పాటికే అయిపోయేది" అంటూ ప్ర‌భాస్ చెప్పాడు. దీనికి బాల‌య్య "మీ అమ్మ‌కి చెప్పిన మాట‌లు నాకు చెప్ప‌క‌య్యా" అంటూ చిన్న కౌంట‌ర్ ఇచ్చారు. ఆదిపురుష్ కో స్టార్ కృతిస‌న‌న్ తో డేటింగ్ లైఫ్ గురించి అడిగారు. "నువ్వు ఎంతో మంది హీరోయిన్స్‌తో యాక్టివ్ చేసి ఉంటావు. అయితే.. రాముడు సీత‌తోనే ఎందుకు ప్రేమ‌లో ప‌డ్డాడు" అని బాల‌య్య అడిగారు. "అది పాత వార్త‌. అవ‌న్నీ కేవ‌లం ప్ర‌చారాలు మాత్ర‌మే. మేడ‌మ్‌(కృతిస‌న‌న్‌) ఇప్ప‌టికే చెప్పేసింది క‌దా. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు. మీకు తెలియంది ఏముంది..? ఏమీ లేక‌పోయినా అన‌వ‌స‌రంగా ఇలాంటి గోల చేస్తున్నారు." అని ప్ర‌భాస్ చెప్పారు.

దీంతో ప్రభాస్‌-కృతిసనన్‌ మధ్య ఉన్న అనుబంధంపై వస్తున్న వార్తలకు ఇక పూర్తిగా చెక్ ప‌డిన‌ట్లే. బాహుబ‌లి-1 ఎపిసోడ్ అభిమానుల‌ను చాలా బాగా ఆకట్టుకుంది. ఇక బాహుబ‌లి-2 ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.


Next Story