బాలయ్య షోలో ప్రభాస్.. ఈరోజు షూటింగ్!

Prabhas is the chief guest of Balakrishna's 'Unstoppable 2' talk show. నటసింహం బాలయ్య బాబు 'అన్‌ స్టాపబుల్ 2' టాక్ షోలో రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా

By Sumanth Varma k  Published on  11 Dec 2022 4:10 PM IST
బాలయ్య షోలో ప్రభాస్.. ఈరోజు షూటింగ్!

నటసింహం బాలయ్య బాబు 'అన్‌ స్టాపబుల్ 2' టాక్ షోలో రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈరోజు ఈ ఎపిసోడ్ కి సంబధించిన షూట్ జరగబోతుంది. సాధారణంగా ప్రభాస్ రిజర్వ్డ్‌గా ఉంటారు. ఎక్కువగా షోస్, ఈవెంట్స్ వంటి వాటికి అటెండ్ కారు. మరీ ప్రభాస్ తో బాలయ్య మధ్య కెమిస్ట్రీ అండ్ ముచ్చట్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో సూపర్ సక్సెస్. హోస్ట్ గా మారాలనుకుంటున్న, ఆల్రెడీ మారిన స్టార్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు బాలయ్య.

సహజంగా ఇద్దరు సెలబ్రిటీల మధ్య ఇంటర్వ్యూలలో జరిగే సంభాషణంతా డిప్లోమాటిక్ సాగుతుంది. ప్రశ్నల నుండి ఆన్సర్స్ వరకు అంతా పాలిష్డ్ గా ఉంటాయి. మరి ఇలాంటి టాక్ షోలతో కిక్కేముంటుంది. రా మెటీరియల్ బయటకు తీసి, నిజాలు జనాల ముందు మాట్లాడుకుంటే ఆ మజానే వేరు. ఆ ట్రెండ్ కి బాలయ్య నాంది పలికారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ టాక్ షో, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన సంగతి తెలిసిందే.

టాలీవుడ్ టాప్ గెస్ట్స్ తో బాలయ్య సరదా సంభాషణలు, ఏళ్లుగా ప్రచారమవుతున్న వివాదాలకు సమాధానాలు ఫస్ట్ సీజన్ లో ఆసక్తి కలిగించాయి. తాజాగా బాలయ్య 'అన్‌స్టాబుల్‌ విత్‌ ఎన్‌బీకే' సీజన్‌-2లో ప్రభాస్ రాబోతున్నాడు. క్రిస్మస్ కానుకగా ఈ ఎపిసోడ్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఈ ఎపిసోడ్ ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.

Next Story