ప్ర‌భాస్ అంటే అంతే మ‌రీ.. త‌న‌కి షాకిచ్చిన అభిమానికి

Prabhas Gifts Expensive Watch to Die-hard Fan.పాన్ ఇండియా స్టార్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఉన్న ఫాలోయింగ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Nov 2021 11:36 AM GMT
ప్ర‌భాస్ అంటే అంతే మ‌రీ.. త‌న‌కి షాకిచ్చిన అభిమానికి

పాన్ ఇండియా స్టార్‌, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు అభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని.. ప్రభాస్‌కు షాక్ ఇచ్చేవిధంగా త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. అత‌డు ఏం చేశాడంటే.. త‌ల‌పై ప్ర‌భాస్ అక్ష‌రాలు క‌నిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అత‌డి అభిమానాన్ని చూసి షాకైన యంగ్ రెబ‌ల్ స్టార్‌.. కాసేపు స‌ర‌దాగా అత‌డితో మాట్లాడారు.

అభిమానితో మాట్లాడిన అనంత‌రం అత‌డిని ఉట్టిచేతుల‌తోని పంపియ లేదు. ఓ ఖ‌రీదైన వాచ్‌ను గిప్ట్‌గా ఇచ్చారు ప్ర‌భాస్‌. ఇది ఫాజిల్ కంపెనీకి చెందిన వాచ్ గా తెలుస్తోంది. దాంతో ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈ విష‌యం తెలిసిన నెటీజ‌న్లు ఫిదా అవుతున్నారు. ఇలా ప్ర‌భాస్ గిప్టులు ఇవ్వ‌డం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో చాలా మందికి ప్ర‌భాస్ ఇలా గిప్టులు ఇచ్చారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌భాస్ న‌టించిన 'రాధేశ్యామ్' చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టించింది. ఇక ప్ర‌భాస్ 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' చిత్రాలతో పుల్ బిజీగా ఉన్నారు.

Next Story
Share it