'భక్త కన్నప్ప'లో ప్రభాస్‌..! మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ హింట్

భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మంచు విష్ణు కూడా హింట్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  10 Sept 2023 1:03 PM IST
Prabhas, Bhakta kannappa, Manchu vishnu, Tollywood,

 భక్త కన్నప్పలో ప్రభాస్‌..! మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ హింట్

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' అని చెప్తుంటారు. ఈ సినిమాను తెరకెక్కించే పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాళహస్తి ఆలయంలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మోహన్‌బాబు చేతుల మీదుగా సినిమా లాంచ్‌ అయింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పాడు మంచు విష్ణు. మహాభారతం సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయనున్నారు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై మంచు విష్ణు కూడా హింట్‌ ఇచ్చారు.

అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ మూవీలో ప్రభాస్‌ నటించనున్నారని, అది కూడా పరమశివుడి పాత్రలో కనిపిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీన్ని సినిమా క్రిటిక్‌ రమేశ్‌ బాలా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే.. దానికి హర హర మహాదేవ్‌ అంటూ మంచు విష్ణు రిప్లై ఇచ్చారు. ఆయన రిప్లై చూసిన ప్రభాస్ ఫ్యాన్స్‌.. సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్‌ చేయడం స్టార్ట్‌ చేశారు. ఓ నెటిజన్‌ భక్త కన్నప్ప ప్రాజెక్టులో ప్రభాస్‌.. నిజమేనా.. నిజమైతే సూపర్‌ అంటూ రాసుకొచ్చాడు. ఆ ట్వీట్‌ను కూడా విష్ణు రీట్వీట్ చేశాడు. దాంతో.. భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ కనిపిస్తారని.. అది కూడా శివుడి పాత్రలోనే అంటూ ఫ్యాన్స్‌ సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రభాస్‌ ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తారనే దానిపై.. మంచు విష్ణు క్లారిటీగా చెప్పలేదు. హర హర మహాదేవ్‌ అంటూ.. ఇతరులు పోస్ట్‌ చేసిన వాటినే రిట్వీట్‌ చేశారు. ఒక వేళ ఇదే నిజమైతే.. ప్రభాస్‌ను ప్రేక్షకులు మూడోసారి దేవుడి పాత్రలో చూసే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే ఆదిపురుష్ మూవీలో రాముడిగా కనిపించగా.. ‘కల్కి’ సినిమాలో విష్ణు మూర్తిగా కనిపించనున్నట్లు సమాచారం.

అయితే.. ఈ సినిమాలో హీరోయిన్ కృతీసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటించనుంది. సినిమాకు రచయితలుగా వ్యవహరిస్తుండగా.. మణిశర్మ, మలయాళ మ్యూజిక్​ డైరెక్టర్​ స్టీఫెన్ దేవాసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

Next Story