అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌కుడితోనే ప్రభాస్‌ 25వ చిత్రం.. టైటిల్ ఫిక్స్‌​

Prabhas announces his 25th film Spirit.యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. వ‌రుస‌గా భారీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2021 11:44 AM IST
అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌కుడితోనే ప్రభాస్‌ 25వ చిత్రం.. టైటిల్ ఫిక్స్‌​

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం పుల్ బిజీగా ఉన్నారు. వ‌రుస‌గా భారీ చిత్రాల‌ను లైన్‌లో పెడుతున్నారు. ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో 'రాధేశ్యామ్' ఒక్కటే పూర్తయ్యింది. 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ తో సినిమా ప్రారంభం కానుంది. తాజాగా మ‌రో ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ప్ర‌భాస్ 25వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈచిత్ర అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రానికి 'స్పిరిట్' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ మూవీ విడుద‌ల కాబోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని భూష‌ణ్ కుమార్ నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు.

Next Story