ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. ఆదిపురుష్ నుంచి కొత్త పోస్ట‌ర్‌

Prabhas Adipurush special poster is out. ప్ర‌భాస్ అభిమానుల‌కు ఆదిపురుష్ చిత్ర బృందం స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 Oct 2022 9:24 AM IST
ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. ఆదిపురుష్ నుంచి కొత్త పోస్ట‌ర్‌

అక్టోబ‌ర్ 23.. ఈ రోజు రెబ‌ల్ స్టార్ అభిమానులు ఎన్న‌టికి మ‌రిచిపోలేని రోజు. ఇది వారికి ఓ పండుగ రోజు. ఈ రోజు పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు. నేడు ప్ర‌భాస్ 43వ ప‌డిలో అడుగుపెట్టాడు. ఈసంద‌ర్భంగా అభిమానుల‌తో పాటు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌భాస్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ప్ర‌భాస్ అభిమానుల‌కు 'ఆదిపురుష్' చిత్ర బృందం స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందులో రాముడిగా ప్ర‌భాస్ లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. విల్లును ప‌ట్టుకుని బాణాన్ని సంధించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌భాస్ క‌నిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఆదిపురుష్' తెర‌కెక్కింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, గ్రాఫిక్స్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటోంది. రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో రాముడిగా ప్ర‌భాస్ క‌నిపించ‌నున్నారు. జాన‌కిగా కృతిస‌న‌న్ న‌టిస్తోండ‌గా రావ‌ణుడిగా బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నాడు. మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్ష‌న్స్‌లో దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో ఆదిపురుష్ సినిమా రూపొందుతోంది.

తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ బాష‌ల్లో ఈ చిత్రం జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Next Story